ఏపీలో ఎక్కడ చూసిన ప్రస్తుతం ఫ్యాన్ గాలే వీస్తుంది.రాష్ట్రం మొత్తం వైసీపీ జెండాలే ఎగురుతున్నాయి.అధికార టీడీపీ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది.అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆంధ్రరాష్ట్ర ప్రజలకు విలువైన సమాచారం ఇచ్చారు.రాష్ట్రానికి ఇప్పుడే నవ శకం మొదలైందని,యువకుడైన జగన్ గారి నేతృత్వంలో అవినీతికి ఆస్కారం లేని, బాధ్యతాయుత, పారదర్శక ప్రభుత్వం ఏర్పడిందని ఆయన అన్నారు.జగన్ స్వచ్ఛమైన పాలనతో ప్రజల కష్టాలను తొలగించేందుకు నిరంతరం శ్రమిస్తారని, ప్రజల ఆకాంక్షలను నేరవేర్చడమే ఆయన ప్రధాన ఎజెండా అని చెప్పుకొచ్చారు.ఇక రాష్ట్రానికి అన్ని మంచిరోజులేనని,మూర్ఖపు మరియు అవినీతి పాలన పోయిందని అన్నారు.