సీఎంగా తన ప్రమాణస్వీకారాన్ని అత్యంత నిరాడంబరంగా నిర్వహిస్తానని చెప్పిన జగన్ తనమాట నిలబెట్టుకున్నారు. 29 లక్షల ఖర్చుతో కార్యక్రమాన్ని ప్రభుత్వ స్ధలమైన ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించారు. 2014లో సీఎంగా ప్రమాణస్వీకారానికి చంద్రబాబు కోటిన్నర ఖర్చుచేశారు. ఇప్పుడు ఇదే అంశంపై భారీ చర్చ జరుగుతోంది.అసలే లక్షలకోట్ల అప్పుల్లో ఉన్న ప్రభుత్వం కొత్తగా అప్పు పుడుతుందో లేదో తెలియని పరిస్ధితిలో సీఎంగా జగన్ కు అనుభవం లేకపోయినా ముందుగా ఆర్ధిక పరిస్ధితి చక్కదిద్దాలని భావించారు. దీంతో ప్రభుత్వం తరఫున నిర్వహించే తన ప్రమాణ స్వీకారాన్ని అతితక్కువ ఖర్చుతో నిర్వహించాలని ఆదేశాలిచ్చారు..
అక్షరాలా 29 లక్షల పదివేల రూపాయలు ఖర్చు చేశారు. ప్రభుత్వం ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ జీవో కూడా ఇచ్చింది. గతంలో టీడీపీ హయాంలో మంత్రులు స్టార్ హోటళ్లలో ప్రెస్ మీట్లు నిర్వహించేవారు. ప్రతీదానికీ కన్సల్టెంట్లపై ఆధారపడి కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టేవారు. దీంతో ప్రభుత్వంపై కోట్ల రూపాయల ఆర్ధిక భారం పడింది.. జగన్ ప్రభుత్వం వచ్చాక ముందుగా ఆర్ధిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఇచ్చి చూపించింది కూడా.. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 1.5 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యింది అనేది తప్పుడు ప్రచారం..
ఆ కోటి 50లక్షలు కేవలం పోలీసులకి కేటాయించారట.. గుంటూరు జిల్లా కలక్టర్ దాదాపు 30 కోట్లు ఖర్చు చేసానట.. అవి కాకుండా విమానాలు, హెలికాప్టర్ల అద్దె కోసం GAD విడిగా చెల్లించిందట.. మొత్తం దాదాపు 60 కోట్లు కర్చు చేసినట్టు తెలుస్తోంది. ఆ కోటి50 లక్షలు కూడా కేవలం పోలీసులకు బస్సులు అద్దెకు, షామియానాలకు, భోజనానికి చేసిన ఖర్చు మాత్రమేనని తెలుస్తోంది. ఇంత చిన్న వయసులోనూ అనుభవం లేకపోయినా జగన్ ఆర్ధిక క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఉన్నతాధికారులు యు ఆర్ గ్రేట్ జగన్ గారు అంటున్నారు.