ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన సోదరి వైయస్ షర్మిళ శుభాకాంక్షలు తెలియజేసారు. కాంగ్రాట్యులేషన్స్ డియర్ ముఖ్యమంత్రి జగనన్న అంటూ ట్వీట్టర్లో షర్మిళ పోస్టు చేశారు. కుటుంబమంతా నీతో ఎల్లప్పుడు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. చివరిలో దేవుడు నిన్ను దీవించును గాక అంటూ ట్వీట్ చేశారు. అయితే షర్మిళతో జగన్, భారతికి విబేధాలున్నాయని ఇప్పటివరకూ చాలామంది టీడీపీ నేతలు చేసిన విమర్శలకు కూడా షర్మిళ సమాధానం చెప్పినట్టయ్యింది.
