ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష మృతి అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తెలుగు సినీరంగంలో అప్పుడప్పుడే ఎదుగుతూ మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష 2002, ఫిబ్రవరి 23న అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. సిద్ధార్థరెడ్డితో ప్రేమ వ్యవహారంతోనే ఆమె చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమెను మూడుసార్లు రేప్ చేసి విషం తాగించి చంపేశారని ఆమె తల్లి సరోజనీదేవి ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన వెనుక అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి చెందిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల కొడుకులు ఉన్నారని ఆమె ఎన్నో సార్లు కొన్ని యూట్యూబ్ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వూల్లో చెప్పింది. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అది ఏమిటంటే ఏపీలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘన విజయం సాధించారు. దీంతో దేశ వ్యాప్తంగా సీని, రాజకీయ ప్రముఖలతో పాటు సామాన్య ప్రజల వరకు అభినందనలు తెలుపుతున్నారు. ఇందులో బాగాంగనే ముఖ్యమంత్రి జగన్ కు సినీనటి ప్రత్యూష తల్లి సరోజనీదేవి కూడ అభినందినట్లు తెలుస్తుంది. అనాడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే తన బిడ్డ చనిపోయిందని..దానికి కారణం కూడ తెలుగుదేశం ప్రభుత్వానికి చెందిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల కొడుకులు ఉన్నారు కాబట్టి ఆమె టీడీపీ అధికారంలోకి రాకుడదని తెలిసినవారితో చెప్పినట్లు తెలుస్తుంది. అందుకే జగన్ గెలిస్తే నా బిడ్డలాగా మరెవరు చనిపోకుండా చర్యలు తీసుకుంటాడు.. మహిళలకు పూర్తి రక్షణ ఉంటుందని చెప్పినట్లు సమచారం. ప్రత్యూష మృతి మిస్టరీని చేధించేందుకు ఆమె తల్లి సరోజనీదేవి ఇప్పటికే పోరాటం చేస్తూనే ఉన్నారు.
