వారికి వివాహం జరిగి కేవలం 14 రోజులైంది… 14రోజుల్లోనే పెళ్లి చేసిన అర్చకుడితో ఆ పెళ్లికూతురు పరారైంది. ఈఘటన మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్ లోని అజాద్ గ్రామంలో గతనెల 7వ తేదీన ఓజంటకు వివాహం జరిగింది. అదే ప్రాంతానికి చెందిన అర్చకుడు వినోద్ మహారాజ్ పండితుడిగా పెళ్ళితంతు పూర్తిచేశాడు. అయితే వివాహం జరిగిన 16వ రోజే పెళ్లికూతురు అదృశ్యమైంది. ఆమె కనబడట్లేదని ఊరంతా తెలిసింది.. అమ్మాయితోపాటు ఆలయ అర్చకుడు కూడా మాయమయ్యాడు. పెళ్లి కూతురు తనతోపాటు లక్షన్నర విలువచేసే బంగారం, 30వేల నగదు తీసుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసారు. పోలీసుల విచారణలో యువతి అర్చకుడితో పెళ్లికి ముందే తెలుసని, గతంలో అతనితో చెట్టాపట్టాలేసుకుని ఆమె తిరిగేదని తేలింది. ఇక అర్చకుడికి ఇప్పటికే ఒక వివాహం జరిగిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
