ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఏపీ మొత్తం ఫ్యాన్ గాలే వీచింది.వైసీపీ దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు పారిపోయారు.గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచారనే చెప్పాలి..ఎందుకంటే గెలిచిన తరువాత తాను ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చేయలేదు.అందుకనే ఈసారి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోకుడదని ఈ ఎన్నికల్లో ఆయనకు సరైన బుద్ధి చెప్పారు.ఫలితమే వైసీపీ రికార్డు స్థాయిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 151సీట్లు గెలుచుకుంది.ఇక 25ఎంపీ సీట్లలో 22 గెలుచుకుంది.
అసలు విషయానికే వస్తే మొత్తం ఎంపీ సీట్లు అన్ని వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అందరు అనుకున్నారు.కాని టీడీపీ గెలిచిన స్థానాలలో చూసుకుంటే గుంటూరు ఎంపీ స్థానంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో రిటర్నింగ్ అధికారి పక్షపాతం ప్రదర్శించారు. స్వల్ప సాంకేతిక కారణం చూపి 9700 ఓట్లను లెక్కించలేదు. ఆర్వో అక్రమానికి పాల్పడి టీడీపీ 4200 తో గెల్చినట్టు ప్రకటించారు. ఆ లెక్కించాల్సిన ఓట్లు లెక్కిస్తే కచ్చితంగా టీడీపీ ఓడిపోతుందని అందరికి తెలిసిన విషయమే.దీనిపై పోరాటం చేస్తామని ఇప్పటికే ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు.