బాపట్ల ఎంపీ నందిగం సురేష్.. ఇటీవల విజయవాడ వచ్చారు. అంటే ఎంపీగా గెలిచిన తర్వాత విజయవాడ వచ్చారు. విజయవాడలోని 1టౌన్ లో సామారంగం చౌక్ శ్రీ సీతారామ ఎలక్ట్రానిక్స్ దగ్గర.. దానిని ఎదురు పొట్టి శ్రీ రాములు గారి విగ్రహం సెంటర్ అని కూడా అంటారు. వెంటనే సురేష్ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. భావేద్వేగానికి గురవుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అదే ప్రాంతంలో తాను ఎంత కష్టపడ్డాడో గుర్తు చేసుకున్నారు. ఇక్కడే ఎర్రటి ఎండ 47% డిగ్రీలలో రోడ్డు పక్కన కూర్చొని నేను మాఅన్నయ్య 1994,95 సంవత్సరాల్లో చీమ చింతకాయలు, తాటి ముంజలు అమ్ముకుని జీవనం సాగించామన్నారు. అప్పటికష్టాలు తలచుకుంటే ఎప్పటికి మర్చిపోలేమన్నారు. దేవుడు ఎంత గొప్పవాడంటే ఎక్కడినుండి ఎక్కడికి తీసుకువచ్చాడో అంటూ కన్నీటిపర్యంతం అయ్యారు. తనను ఇంతటి వాడిని చేసిన జగనన్న రుణం ఏమిచ్చి తీర్చుకోగలను అంటూ సురేష్ భావోద్వేగానికి లోనయ్యారు.
