నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో పండుగ వాతావరణం నెలకొంది. వేలాది మంది వైసీపీ అభిమానులు, కార్యకర్తలు ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి వచ్చారు. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రజలకు అభివాదం చేసిన వైఎస్ విజయమ్మ.. కాసింత ఉద్వేగానికి లోనయ్యారు. తన తనయున్ని అక్కున చేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ‘నన్ను దీవించిన రాష్ట్ర ప్రజలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆశీర్వదించిన దేవునికి, పైనున్న నాన్నగారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాధాభివందనం చేస్తున్నాన’ని తెలిపారు.
