నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల హర్షాతిరేకాల మధ్య జగన్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు.
నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల హర్షాతీరేకాల మధ్య జగన్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రిగా కర్తవ్యాన్ని, బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ముందుగా అనుకున్నట్టుగానే సరిగ్గా మధ్యాహ్నం 12. 23 గంటలకు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలలనుంచి అభిమానులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు.