వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రస్తుతం ఏపీలో ఇది ఒక ప్రభంజనం అని చెప్పాలి.ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీ అయి ఉండి కూడా అధికార టీడీపీ పార్టీని మట్టికరిపించింది.ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఫ్యాన్ గాలే వీస్తుంది.జగన్ పడ్డ కష్టానికి ఫలితం దక్కిందనే చెప్పాలి.పదేళ్ళు అధికారం లేకపోయినా ఎన్నో వడిదుడుకులను ఎదుర్కొని పాదయాత్రతో ముందుకు సాగుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నాడు.ఆంధ్రరాష్ట్ర ప్రజలు కూడా ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ చేసిన అక్రమాలకూ,అన్యాయాలకు విసిగిపోయారు.
అందుకే ఈ ఎన్నికల్లో చంద్రబాబుకి సరైన బుద్ధి చెప్పారు.దీంతో వైసీపీ పార్టీ భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించింది.నవ్యాంధ్ర రెండవ ముఖ్యమంత్రిగా జగన్ ఈరోజు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 12.23 నిమషాలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈమేరకు అన్ని జిల్లాల నుండి భారిగా జనాళ్ళు తరలి వస్తున్నారు.ఒక ఆంధ్రానే కాకుండా పక్క రాష్ట్రమైన తెలంగాణ నుండి కూడా అధికసంఖ్యలో అభిమానులు వస్తున్నారు.కనీవినీ ఎరుగని రీతిలో ఈ ప్రమాణస్వీకార వేడుకలు జరగబోతున్నాయని తెలుస్తుంది.