వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ మహోత్తర ఘట్టానికి ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం ముస్తాబైంది. అయితే జగన్ గెలుపై దేశ వ్యాప్తంగా ప్రశంశలు అందుకుంటున్నాడు. తాజాగా సినీయర్ నటి జయప్రద జగన్ గురించి ఆసక్తికర వాఖ్యలు చేశారు. ఎన్నో రోజుల తర్వాత ప్రజలకి అద్భుతమైన సమయం వచ్చింది. శుభారంభం ఇది. దివంగత నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డిగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పేదవాళ్లను నేనున్నానంటూ అక్కున చేర్చుకుని వారి కన్నీళ్లు తుడిచేవారు. వైఎస్‌గారి దగ్గర నుంచి జగన్ రాజకీయంగా చిన్నప్పటి నుంచి ఎంతో నేర్చుకొని ఉంటారు. ఏపీని బాగా అభివృద్ధి చేయాలని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏపీని కేంద్ర బిందువుగా చేయాలనే తపన జగన్‌లో కనిపించేది. చంద్రబాబునాయుడి ధాటిని ఎదుర్కొంటూ ఒక సమర్థవంతమైన ప్రతిపక్ష నాయకునిగా నిలబడి ప్రజల కష్టాలు, కన్నీళ్లు తనవి అనుకుంటూ ప్రజల పక్షాన న్యాయం కోసం పోరాడినది ప్రజలు మరచిపోలేరు. ప్రజల మధ్యనే ఉంటూ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దాదాపు 10ఏళ్లుగా ప్రజల మధ్యలోనే ఉంటూ తన కుంటుంబాన్ని, తన వాళ్లకి దూరంగా ప్రజల మనిషిగా అయిపోయి ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని వారి నుంచి సమస్యలు తెలుసుకున్నారు. 2019 ఎన్నికల సమరంలో తన విజయ దుందుభి మోగించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న ఈ సమయంలో జగన్‌బాబుకి నా అభినందనలు, శుభాకాంక్షలు అన్నారు.
