ఒకాయన రాజశేఖరరెడ్డికి వీరాభిమాని.. ఆయన కొడుకు జగన్మోహన్‌రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షించాడు. అంతవరకు పాదరక్షలు వేసుకోనని మొక్కుకున్నాడు… ఆయనే ఆదిలాబాద్‌కు చెందిన బెజ్జంకి అనిల్‌కుమార్. నేడు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన వ్రతం వీడారు. అనిల్‌కుమార్ తెలంగాణలోని అదిలాబాద్ కు చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు అనుభవించారు… దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ అభిమాని, వైఎస్ దివంగతులైనప్పుడు వైసీపీలో చేరారు. జగన్ సీఎం కావాలని ఆకాంక్షించాడు.. ఆమరణ దీక్ష కూడా చేసారు. అప్పుడే ఆదిలాబాద్ నుంచి బాసర వరకు పాదయాత్ర చేసారు.
2009 సెప్టెంబర్ 4న జగన్ సీఎం అయ్యేవరకు పాదరక్షలు ధరించనని వ్రతం పూనారు. ప్రస్తుతం తెలంగాణలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పదేళ్లతర్వాత ఆయన కల నెరవేరుతుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో తన దీక్షను విరమించారు. విజయవాడ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే పాదరక్షలు ధరించి పదేళ్ల తన కఠోర దీక్ష ముగించారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఘడియ రావడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు.