నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల హర్షాతీరేకాల మధ్య జగన్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రిగా కర్తవ్యాన్ని, బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని జగన్ దైవసాక్షిగా ప్రమాణం చేసారు. అయితే కుమారుడు గొప్ప స్థానానికి ఎదిగితే ఏ తల్లి అయినా ఎంతో సంతోషిస్తుంది. విజయమ్మ కూడా అలాగే సంతోషపడి భావోద్వేగానికి లోనయ్యారు. బిడ్డను తీసుకుని హృదయానికి హత్తుకున్నారు. జగన్‌ను దగ్గరకు తీసుకుని ఆనంద భాష్పాలు రాల్చింది. వెంటనే కుమారుడు జగన్ తన చేత్తో కన్నీటిని తుడిచి ఓదార్చారు. ఈ సన్నివేశంతో సభలో ఒక్కసారి అందరి గుండెలు కరిగిపోయాయి. తొమ్మిదేళ్లు ఎంతో కష్టనష్టాలనోర్చుకుని, బాధలు దిగమింగుకుని జగన్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది.
