ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డిపై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థ తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో ఓడించి అఖండ విజయాన్ని చేజిక్కించుకున్న జగన్‌ను ‘విజయ వీరుడు’ అని శివసున అభివర్ణించింది. గురువారం శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ప్రచురించింది. సామ్నా సంపాదకీయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే మహారాష్ట్రలో బిజెపి ఘోర పరాజయం మూటగట్టుకుందని థాకరే వ్యాఖ్యానించారు. అయితే బీజేపీని వ్యతిరేకించినా జగన్ ని శివసేన ప్రశంసించడం పట్ల వైసీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
