నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం విజయవాడలో చాలా నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలు రాజకీయ పార్టీల అధినేతలు, నేతలు,వైసీపీ శ్రేణులు,వైఎస్సార్ అభిమానులు వేలాదిగా తరలిరానున్నారు. అయితే ,ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అదే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయాన్ని సాధించింది ..
అధికారంలోకి వచ్చిన టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని పేరిట అమరావతిలో చేసిన భూకబ్జాలపై ,పలు అవినీతి అక్రమాలపై న్యాయవిచారణకు ఆదేశించే ఫైలు పై వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అదే వేదికపై నుండి సంతకం చేయనున్నారని వార్తలు వినిపిస్తోన్నాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తన ప్రసంగంలో ఈ అంశం గురించి ప్రస్తావించనున్నారని సమాచారం.
ఆ తర్వాత నవ్యాంధ్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రభుత్వ అధికారులు కలిసి.. అమరావతిలో జరిగిన ల్యాండ్ మాఫీయా గురించి విచారణ చేయించడానికి సిట్టింగ్ జడ్జ్ ను కేటాయించాలని కోరనున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంతమైన అమరావతి పరిధిలోని మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందిన సీఆర్డీయే,రెవిన్యూ అధికారులు ,తెలుగు తమ్ముళ్ళు పలు అవినీతి అక్రమాలకు పాల్పడట్లు వస్తోన్న వార్తలపై నివేదిక కోరనున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసే కీలక ప్రకటన బాబు అండ్ బ్యాచ్ గుండెల్లో రైళ్ళు పరుగెత్తించడం ఖాయమన్నమాట..