ఏపీ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి రోజే తనదైన మార్కును కనబరచారు. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తూ నూట యాబై ఒక్క స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈ రోజు గురువారం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సరిగ్గా పన్నెండు గంటల పది నిమిషాలకు వేదికకు చేరుకున్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చేత పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,తెలంగాణ రాష్ట్ర మంత్రులతో పాటు డీఎంకే అధినేత స్టాలిన్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారనంతరం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ”ఏపీలో గత ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టుల్లో జరిగిన పలు అవినీతి అక్రమాలపై విచారణ చేయిస్తామని”అన్నారు. కొత్తగా హైకోర్టు జడ్జి చేత జ్యూడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసి ఇకపై ప్రకటించే కాంట్రాక్టులను ముందు ఆ కమీషన్ వద్దకు తీసుకెళ్తామన్నారు. జడ్జి సూచనలు ,సలహాలు ,మార్పుల అనంతరమే టెండర్లను పిలుస్తామని అన్నారు.
ఏడాదిలో ఏపీని క్లీన్ చేస్తామన్న జగన్ ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాసే మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని ఆయన అన్నారు. అయితే జగన్ తీసుకున్న తెలుగు తమ్ముళ్ల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. గత ఐదేండ్లుగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేయని అవినీతి అక్రమాలు లేవు.. పాల్పడిన కబ్జాలకు లేవు. జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో తాము జైల్లో ఊసలు లెక్కపెట్టడం ఖాయమని అంతరమదనం చెందుతున్నారు అంట తెలుగు తమ్ముళ్ళు