ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం విజయవాడ వేదికగా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నవ్యాంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారనంతరం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తీసుకునే మొదటి నిర్ణయం.. తొలి సంతకంపైనే అందరి దృష్టి నెలకొన్నది.
అందులో భాగంగా గతంలో అప్పటి ఉమ్మడి ఏపీలో పాదయాత్ర తర్వాత ప్రభంజనం సృష్టించి అధికారాన్ని దక్కించుకున్నాక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తండ్రి,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో ముఖ్యమంత్రిగా రైతన్నలకు సంబంధించిన రైతన్నకు ఉచిత కరెంటు సరఫరా ఫైల్ పై తొలి సంతకం చేసిన సంగతి తెల్సిందే.
దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడైన వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం రైతన్నలకు సంబంధించి వరాలు కురిపించిన నవరత్నాల్లో ఒకదానిని అమలు చేస్తూ దానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేయనున్నట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. చూడాలి మరి జగన్ ముఖ్యమంత్రిగా చేసే తొలి సంతకం ఏమిటో కొన్ని గంటల్లో తెలుస్తుంది..