నవ్యాంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం మధ్యాహ్నాం గం.12.23నిమిషాలకుప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనబడే నేను’’ అంటూ తెలుగులో ప్రమాణం మొదలెట్టారు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్, పుదుచ్చేరి మంత్రి మాల్లాడి కృష్ణారావు, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పీవీపీ రామచంద్రరావు, తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
అయితే ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఉదయం గం.11.54నిమిషాలకు తాడేపల్లిలోని తన ఇంటి నుండి కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరిన ఆయన పన్నెండు గంటలకు వేదిక వద్దకు చేరుకున్నారు. గత తొమ్మిదేళ్ళలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చేతికి వాచ్ ధరించారు. జగన్ ధరించిన ఈ వాచ్ గురించి నెటిజన్లు తెగ కామెంట్ల ,పోస్టుల వర్షం కురిపిస్తున్నారు.
గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ధనికుడైన కానీ కనీసం చేతికి వాచ్ లేని పేదవాడిగా గబ్బలు కొట్టారు. కానీ నేడు జగన్ ఒక సామాన్యుడు ధరించే వాచ్ ను ధరించి నేను సామాన్యుడి లెక్క సమయాన్ని చూస్తూ ప్రజలకోసం పనిచేస్తూ సమయం కంటే వేగంగా ముందుకు దూసుకుపోతానని సందేశమిచ్చారని నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు ధరించిన వాచ్ మహా అయితే వేలల్లోనే ఉంటుంది. అది రెండు నుండి ఐదు వేల వరకు మాత్రమే ఉంటుందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు..