ఈనెల 30న విజయవాడలో జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ నేతలు హజరుకానున్నారు. ఈమేరకు వైసీపీ వర్గాలకు సమాచారం అందింది. మరోవైపు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం అంగరంగా జగన్ ప్రమాణ స్వీకారానికి ముస్తాబైయినట్లు తెలుస్తుంది. ఈనెల 30 గురువారం రోజున మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఆ దిశగా స్టేడియం లోపల, బయట ఏర్పాట్లు చేపట్టారు. అంచనాలను మించి వచ్చినా వీక్షించేందుకు విజయవాడలోని ముఖ్య కూడళ్లలో భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. అయితే జగన్ ప్రమాణస్వీకారోత్సవనికి దేశ వ్యాప్తంగా ఉన్న సీనీయర్ సినీ , రాజకీయ నేతలు వీరే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వైఎస్ జగన్ తండ్రి దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు, స్నేహపూర్వకంగా ఉండే నాయకులతో పాటు దాదాపుగా 25 రాష్ట్రాలనుంచి జగన్ శ్రేయోభిలాషులు, వివిధ పార్టీల అధ్యక్షులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారట.. వీరిలో ప్రస్తుతానికి ఈ పేర్లు వినిపిస్తున్నాయి. మిగిలిన నాయకుల జాబితా మరో రెండ్రోజుల్లో తెలియనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి ..కేసీఆర్
ఉండవల్లి అరుణ్ కుమార్
డీఎంకే అధినేత, తమిళనాడు మాస్ లీడర్ స్టాలిన్
గాలి జనార్ధన్ రెడ్డి
సీపీఐ అగ్రనేత సీతారాం ఏచూరి
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ
పవన్ కళ్యాణ్
చిరంజీవి
సూర్య
విశాల్
నాగర్జున
సుమంత్
యాంకర్ శ్యామల వీరితో పాటు చాల మంది సిని, ప్రముఖులు వస్తున్నట్లు తెలుస్తుంది.