ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం మద్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని అభినందించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున అభిమానులు తరలివెళ్లనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఉత్సవాన్ని కళ్లారా చూసి తీరాల్సిందేనన్న పట్టుదలతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వైసీపీ విజయాన్ని ఇప్పటికే భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, ర్యాలీలతో స్వాగతించిన అభిమానులు.. ఇక ఆయన ప్రమాణ స్వీకారం చూస్తే మరో ఘట్టం కూడా పూర్తి చేసినవారువుతామని అనుకుంటున్నారు. అయితే జగన్ జనసేనా అధినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాన్‌కు ఫోన్ చేసారు. మీరు ఎన్నికల్లో బాగా పోరాడారు..రాజకీయాలు వేరు. ఇది వ్యక్తిగత సంబంధంతో ఆహ్వానిస్తున్నా..ప్రమాణ స్వీకారానికి రండి అంటూ ఆహ్వనించారు. పవన్ సైతం షూర్ అంటూ సమాధానం ఇచ్చారని తెలుస్తుంది. ఇంకా తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖలను కూడ ఆహ్వానించినట్లు సమచారం.
