ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.ఇప్పుడు ఆంధ్రలో ఎక్కడ చూసిన జగన్ అనే వినిపిస్తుంది.చిన్న పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళు వరకు జై జగన్ అంటున్నారు.వైసీపీ దెబ్బకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం చతకలపడిపోయాడు.జగన్ రికార్డు స్థాయిలో అత్యధిక మెజారిటీతో గెలిపొందారు.ఏపీలో మొత్తం అసెంబ్లీ సీట్లు 175 కాగా అందులో 151 సీట్లను వైసీపీ గెలుచుకుంది.ఇక ఎంపీ విషయానికి వస్తే మొత్తం 25ఎంపీలకు 22గెలిచి రికార్డు సృష్టించారు.ఫలితమే ఇండియాలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకున్న పార్టీలో వైసీపీ మూడో స్థానంలో ఉంది.
ఇక టీడీపీ పరంగా చూసుకుంటే ఒక రాష్ట్రంలో అధికార పార్టీ అయి ఉండి కూడా కనీస సీట్లు గెలుచుకోలేదు.కేవలం 23ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుచుకోగా,మూడు ఎంపీ సీట్లు గెలుచుకుంది.ఒక సీటు జనసేనకు దక్కింది.అధికారంలో ఉన్న పార్టీ ఇంత దారుణంగా ఓడిపోయింది అంటే అర్ధం చేసుకోండి ఆ పార్టీ మీద జనాలకు ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుంది.ఇక్కడే టీడీపీకి అసలు సమస్య మొదలైంది.గెలిచిన 23 ఎమ్మెల్యేలు ప్రస్తుతం టీడీపీ తో ఉంటారా లేదా అనేది ఇప్పుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.తాజా సమాచారం ప్రకారం కొంతమంది బీజీపీ లో చేరుతారని కొందరు వైసీపీలో చేరుతారనే వార్త ఎక్కువగా వినిపిస్తుంది.అదేగాని జరిగితే టీడీపీ భూస్థాపితం అనే చెప్పుకోవాలి.