ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న శుభతరుణంలో ప్రముఖ టాలీవుడ్ బాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రముఖ టాలీవుడ్ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ సాక్షిగా పవన్ ను ఏకిపారేశాడు వర్మ.ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశించి చేసిన విమర్శల్లోని కొన్నిటిని తీసుకుని వాటిని ప్రస్తావిస్తూ విమర్శల బాణం ఎక్కుపెట్టాడు వర్మ.
అందులో భాగంగా ఎన్నికల ప్రచారంలో జనసేనాని అంటూ పవన్ ను పేరును ప్రస్తావించకుండా “వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని లక్ష్యంగా పవన్ “చేసిన విమర్శలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్లో వర్మ”‘జగన్ నువ్వేలా సీఎం అవుతావో చూస్తా?, జగన్ చిన్న కోడికత్తికే గింజుకున్నారు, తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు.రాయలసీమ రౌడీలను గోదాట్లో కలిపేస్తా, నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఆపేదెవడు?.
జగన్ అవిశ్వాసం పెడితే దేశం మొత్తం తిరిగి 50 మంది ఎంపీల మద్దతు కూడగడతా, 2 లక్షల పుస్తకాలు చదివా, 32 మార్కులతో 10 పాసయ్యా, మా అన్నయ్య కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోతే సాక్షిలో నీచంగా రాశారు.(ఆమె వెళ్లిపోయింది 2007లో అయితే సాక్షి పేపర్ 2008 మార్చిలో ప్రారంభమైంది)’ అని అవగాహన రాహిత్యంగా పలు సందర్భాల్లో పవన్ చేసిన వ్యాఖ్యలను వర్మ ట్వీట్ చేశారు.