మాజీ సీయం చంద్రబాబు నాయుడు తన హంగూ ఆర్బాటాల్ని ప్రదర్శించారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా మందీ, మార్బలంతో హడావిడి చేసారు. ఇక విదేశీ పర్యటనలకైతే చెప్పాల్సిన అవసరవం ఉండదు. ఒక టీం మొత్తాన్ని ప్రత్యేక విమానంలో విదేశాలకు తీసుకువెళ్లి కార్యక్రమాలు చేపట్టారు. దానివల్ల ఎంత ఖర్చు అవుతుందో, అంత నష్టం జరిగింది. అసెంబ్లీలో కూడా బాబు గారి దుబారాపై వైసీపి సూటిగా ప్రశ్నించింది. అలాగే 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకార ఖర్చుల గురించి మరోవార్త వైరల్ అవుతోంది. 2014లో ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు పెట్టిన ఖర్చు 5కోట్లని, ఇప్పుడు జగన్ కేవలం 10 లక్షలు మాత్రమే ఖర్చుచేసేందుకు అనుమతించారని వైరల్ అవుతోంది. జగన్ విజయవాడ నగరంలో దాదాపు 20 కూడళ్లలో భారీ ఎల్. ఈ. డీ స్క్రీన్లు ఏర్పాటుచేస్తున్నారు.
తీవ్రమైన ఎండ ప్రభావం ఉండడంతో ప్రమాణ స్వీకారానికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని 2లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 5లక్షల మంచినీటి ప్యాకెట్లు, భోజన సదుపాయాలను ఏర్పాటుచేస్తున్నారు. లక్షల మంది తరలివచ్చే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం వీలైన మేర అతితక్కువ ఖర్చే చేస్తున్నా కొందరు ఇంకా జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే కేవలం ప్రభుత్వంపై భారం పడకూడదనే ఆలోచనతో జగన్ నిరాడంబరంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వంపై భారం పడకుండా సాదాసీదాగా ప్రమాణస్వీకారం చేస్తున్నారన్నారు.
ప్రమాణస్వీకారానికి వచ్చే ప్రజలు, అభిమానులు ఎండతీవ్రత ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఓట్లువేసి నిండుమనస్సుతో వైసీపీని ఏ విధంగా ఆశీర్వదించారో అదే స్ఫూర్తితో ప్రజలంతా ఇంటి దగ్గరనుంచి ప్రమాణస్వీకార మహోత్సవాన్ని వీక్షించాలని కోరారు. ఎండతీవ్రతతో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇంటి వద్ద నుంచే ప్రసారాలు చూస్తూ తనను దీవించాలని జగన్ కోరారు. ప్రమాణస్వీకారానికి వేలకోట్లు ఖర్చుచేసి ఆఖర్చును ప్రజల నెత్తిన రుద్దవద్దనే ఆలోచనతో సాదాసీదాగా జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది.