ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అధ్యక్షణ తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసింది.ఎప్పుడూ 40సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇప్పుడు ఈ ఓటమిని ఎలా సమర్దించుకుంటాడు అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న.వైసీపీ దెబ్బకు టీడీపీ లో సీనియర్ నాయకులు సైతం బోల్తాపడ్డారు.అధికార పార్టీకే అన్ని సీట్లు వచ్చాయి అంటే ఈ ఐదేళ్లలో వారి పరిపాలన ఎంత దారుణంగా ఉంటుందో మీరే అర్డంచేసుకోవచ్చు.అసలు టీడీపీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణం ఏమిటి అంటే ఆ పార్టీ చేసిన అన్యాయాలు,అక్రమాలు అని చెప్పాలి.
ముందుగా చూసుకుంటే చంద్రబాబు పల్లెటూరులో ఏదో చెయ్యాలని జన్మభూమి కమిటీ పెట్టిన విషయం అందరికి తెలిసిందే.గ్రామాల్లో ప్రజలకు మంచి చెయ్యాలని పెట్టిన ఈ కమిటీ జనాలకన్నా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే,నాయకులకే బాగా ఉపయోగపడిందని చెప్పాలి.ఈ కమిటీ పేరుతో మొత్తం సొమ్ము నొక్కేసారు.ఆంధ్రరాష్ట్రంలో జరిగిన పెద్ద కుంభకోణం ఏదైనా ఉంది అంటే అది అగ్రిగోల్ద్ భాద్యతులే అని చెప్పాలి.చంద్రబాబుని నమ్ముకున్నందుకు ప్రజలు నిలువునా మునిగిపోయారు.ఇక్కడ చంద్రబాబుపై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.
ఇవేకాకుండా కాల్ మనీ, ఎర్రచందనం మరియు ఇసుక మాఫీయా ఇలా ఎన్నో అక్రమాలకూ టీడీపీ ప్రభుత్వం ముందుండి నడిపించింది.ఇంత జరుగుతున్న చంద్రబాబు మాత్రం ఆక్షన్ తీసుకోకుండా వాళ్ళకే సపోర్ట్ చేసారు. అంతేకాకుండా ఇది తప్పు అని అడిగినవారని అధికార బలంతో పోలీసులతో కొట్టించేవారు.ఇదంతా ఈ ఐదేళ్లలో చంద్రబాబు చేసిన నిర్వాకం ఇంకోసారి కూడా బాబు వస్తే ఏపీ అన్యాయం అయిపోతుందని ప్రజలు ఈసారి జగన్ ని గెలిపించారు.