ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఘోర పరాజయం ఎదురైన విషయం అందరికి తెలిసిందే.వైసీపీ దెబ్బకు టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.ఈ మేరకు నిన్న సాక్షిలో ఒక కధనం కూడా వచ్చింది.మాజీ మంత్రి నారా లోకేష్ తమ పార్టీ నాయకులు, నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారని,ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం మా పార్టీ నేతలేనని,వీరే మమల్ని మోసం చేసారని అన్నారని,గుంటూరు ఎంపీ స్థానానికి పోటీ చేసిన గల్లా జయదేవ్ గెలిచినప్పుడు ఆ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలు ఎందుకు ఓడిపోయామని నేతలను ప్రశ్నించినట్టు వార్త రాసారు.దీనిపై స్పందించిన మాజీ మంత్రి నారా లోకేష్ సాక్షిపై మండిపడ్డారు.నేను అనలేని మాటలు కూడా కల్పించి వార్తలు రాస్తున్నారని సాక్షిపై తన కోపాన్ని వ్యక్తం చేసారు లోకేష్.
అయితే మరి ఇన్ని చెబుతున్న లోకేష్ గారు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ తో కలిసి పచ్చ మీడియా ఎలాంటి వార్తలు ప్రచూరించేదో మర్చిపోయారు అని నెటీజన్లు ప్రశ్నించారు.జగన్ మోదీనీ కలిసిన,కేసీఆర్ ను కలిసిన ఎక్కడికైనా వెళ్ళిన ఇలా జగన్ వేసే ప్రతీ అడుగుకు ఆ పని మంచికా లేదా చెడ్డకా అని ఆలోచించకుండా బాబు అండ్ కో నోటికొచ్చిన వార్తలు రాసేవారు.అప్పుడు రాని మాటలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని లోకేష్ ని ఒక ఆట ఆడుకున్నారు నెటీజన్లు.అప్పుడు జగన్ పై అన్ని చెడ్డ వార్తలు వచ్చినా జగన్ మౌనంగానే ఉన్నారు.కాని ఇప్పుడు నిజాలు చెబుతున్న లోకేష్ మాత్రం దానిని వ్యతిరేక్కిస్తున్నారు.