ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ సునామీలా దూసుకెల్లింది.ఆ సునామీ ధాటికి తట్టుకోలేక టీడీపీ అతలాకుతలం అయ్యింది.వైసీపీ రికార్డు స్థాయిలో ఏకంగా 151 సీట్లు గెలుచుకుంది.ఇప్పటివరకూ ఇలాంటి విజయం సాధించడం ఎవరివల్లా కాలేదనే చెప్పాలి.అటు ఎంపీ సీట్లు కూడా 22గెలిచి రికార్డు సృష్టించాడు.ఫలితంగా దేశంలోనే వైసీపీ పార్టీ మూడో స్థానంలో నిలిచింది.ఆంధ్రలో అధికార టీడీపీ కనీస సీట్లు కూడా గెలవలేకపోయింది.టీడీపీ మంత్రులు కూడా చాలా దారుణంగా ఓడిపోయారు.ఇక వైసీపీకి వస్తే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదేళ్ళ కష్టానికి ఫలితమనే చెప్పుకోవాలి.కాంగ్రెస్ నుండి విడిపోయినప్పటి నుండి తానే స్వయంగా భాద్యతలు తీసుకొని అధికారం లేకపోయినా ప్రజలకు ఏదో చెయ్యాలనే సంకల్పంతో ఉన్నారు.
తాను చేసిన పాదయాత్రతో ప్రతిఒక్క టీడీపీ నాయకుడుకి భయం పుట్టిందనే చెప్పాలి.పాదయాత్రలో గడప గడపకు తిరిగి అందరి సమస్యలను తెలుసుకున్నారు.అలుపెరగని సమర యోధుడిలా ప్రయాణం సాగించారు.దాని ఫలితమే ఈరోజు రాష్ట్ర ప్రజలు జగన్ ను నమ్మి భారీ మెజారిటీతో గెలిపించారు.అంతేకాకుండా దేశంలోనే నెంబర్ వన్ సీఎం అని కూడా అనిపించుకున్నాడు.ఈమేరకు ప్రమాణస్వీకారం చేయకముందే జగన్ పోలీస్ వ్యవస్థలో కొన్ని మార్పులు చేసారు.ప్రమాణస్వీకారం అనతరం జూన్ 1 నుండి జూన్ 5వరకు అన్ని శాఖలకు సంభందించి పూర్తిగా పరిశీలనా చేయనున్నారు.