నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి వర్యులుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు గురువారం విజయవాడ వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెల్సిందే. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నూట యాబై ఒక్క స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది. ఇరవై రెండు ఎంపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో తొమ్మిది లేదా పదకొండు మందితో రేపు గురువారం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన పలు ఏర్పాట్ల నిర్వాహాణలో అధికారులు నిమగ్నమయ్యారు.
అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఎన్నికల హామీలలో ఒక హమీ అమలు చేయనున్న పైలుపై సంతకం చేయనున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. నవరత్నాలతో పాటుగా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోనూ.. పాదయాత్రలోనూ పలు హామీలను వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రజలకిచ్చిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రస్తుతమున్న పదమూడు జిల్లాలను పార్లమెంట్ నియోజకవర్గాలకు అనుగూణంగా మొత్తం ఇరవై ఐదు జిల్లాలను చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.
దీనితో పాటుగా ఒక గిరిజనజిల్లాను సైతం ఏర్పాటు చేస్తామని కూడా ఆయన అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ఫైలుపై జగన్ సంతకం చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.గతంలో ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతన్నకు తొమ్మిది గంటల ఉచిత కరెంటిస్తామనే ఫైలుపై సంతకం చేసిన సంగతి తెల్సిందే..