ఏపీలో అఖండ విజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే అన్ని ఎర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దారుణంగా ఓడిపోయిన టీడీపీ నేతలు జగన్ గెలుపు వార్త విని ఇంకా తేరుకోలేకున్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా జగన్ ప్రజలు కష్టాలు తెలుసుకొని వారితోనే ఉంటూ..కొండంత భరోస ఇస్తూ వచ్చారు. మరి ముఖ్యంగా టీడీపీపై తీవ్ర వ్యతీరేకత రావడంతో ఏపీలో మొత్తం సినీయర్ నేతలు ఘోర ఓటమిపాలయ్యారు. 4 జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే కర్నూల్ జిల్లాల పేరుపొందిన రాజకీయ కుటుంబాలన్నీ ఇంటిబాట పట్టాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న, చేరిన కేఈ, కోట్ల కుటుంబాలతో పాటు భూమా, బుడ్డా, గౌరు కుటుంబాలకు రాజకీయంగా జిల్లా ప్రజలు సమాధి కట్టారు. అయితే ఓటమిపై ఆళ్లగడ్డ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త స్పందిచినట్లు సోషల్ మీడియాలో వార్తాలు వస్తున్నాయి. మేము వైసీపీలో ఉంటే గెలిచెవాళ్లం..ఏపీ మొత్తం వైసీపీ ఫ్యాన్ గాలే వీచింది అన్నారని తెగ ప్రచారం జరుగుతుంది. ఎది ఎమైన జిల్లాలో మరోసారి జగన్ ఘన విజయం సాదించాడు.
