ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే. అయితే జగన్ తోపాటుగానే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ముందు భావించిన కానీ మంత్రి వర్గ విస్తరణ తర్వాత చేయడానికి జగన్ మొగ్గుచూపినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో వచ్చే జూన్ నెల పదకొండు,పన్నెండు తారీఖుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో అదే సమయంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ కార్యాలయానికి సమాచారం అందింది.
దీంతో సీఎస్ తో అధికారులు ఈ మేరకు చర్చించారు. జూన్7 న ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. మంత్రి వర్గ ఆమోదంతోనే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇక అదే నెల జూన్ చివర బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. అంతకుముందు జూన్ 3నుండి జూన్ 6వరకు పలు శాఖల వారీగా జగన్ సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.