తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడైన మంత్రి లోకేష్ గురించి ఇటీవల ఓ వార్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని శర్మకు లోకేష్‌కు మధ్య `సన్నిహిత సంబంధం` ఉందని జనసేన పార్టీకి చెందిన ఓ మహిళా నేత ఆరోపించడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. లోకేష్-యామిని సంబంధం గురించి పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు.
ఈ నేపథ్యంలో….మామిని మాట్లాడుతూ లోకేష్‌తో సంబంధం గురించి క్లారిటీ ఇచ్చారు. రా లోకేష్ తనకు అన్న లాంటి వారని…తనపై ఇలాంటి పుకార్లను సృష్టించవద్దని ఆమె కోరారు. “నా భర్తతో నా జీవితం సంతోషంగా సాగిపోతోంది. నాకు ముగ్గురు ఆడపిల్లలు, వారి భవిష్యత్తు, నా కుటుంబం, నా వ్యాపారాలతో నాకు సమయం సరిపోతుంది. ఇలాంటి చిల్లర పనులు చేయాల్సిన అవసరం నాకు ఏముంది?“ అని వ్యాఖ్యానించారు.
ఓ యూట్యూబ్ ఛానల్‌తో యామిని మాట్లాడుతూ, సోషల్ మీడియాలో జరిగే ఇలాంటి తప్పుడు ప్రచారం విషయంలో స్పందించాల్సిన అవసరం ఏమాత్రం లేదని అన్నారు. లోకేష్ తనకు బెంజ్ కారు కొనిచ్చారనే ప్రచారం సైతం శుద్ధ తప్పు అని యామిని స్పష్టం చేశారు. తనకు ఇలాంటి అంశాలపై స్పందించే సమయం అసలు లేదని పేర్కొంటూ అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించాల్సి వస్తోందన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు ప్రత్యరోపణలు సహజమే కానీ…ఈ స్థాయిలో దిగజారి వ్యవహరించడం సరికాదన్నారు.