స్వామివారిని దర్శించుకునే భక్తులకు షాకింగ్ న్యూస్.తూర్పుగోదావరి జిల్లా అన్నవరం లోని రత్నగిరి కొండపై వెలసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించుకోవాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాలి.అన్నవరం అంటే దేవాలయమే కాదు ఇది ఒక పర్యాటక ప్రాంతం కూడా.ఎక్కడెక్కడి నుండో భక్తులు ఈ స్వామివారి దర్శనం కోసం వస్తారు.అయితే మొన్నటివరకు పెద్దవాళ్ళు నుండి చిన్న పిల్లల వరకు ఎవరైనా సరే దర్శనానికి ఎలా వచ్చిన ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.కాని ఇప్పుడు రూల్స్ మారిపోయాయి.ఇది స్వయంగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి (ఈవో) ఎంవీ సురేష్‌బాబు చెప్పారు.
స్వామి వారిని దర్శించుకోవాలన్నా, పూజలు, వ్రతాలు, ఇలా ఎలాంటిదైన సరే ఇకపై భక్తులు సంప్రదాయ దుస్తులలో రావాలని సూచించారు.ఆదివారం మీడియాతో మాట్లాడిన ఈవో మగవాళ్ళు పంచె, కండువా ధరించాలి ప్యాంటు మాత్రం దరించకూడదని చెప్పారు.ఇక మహిళల విషయానికి వస్తే చీర, పంజాబీ డ్రెస్ వంటివి ధరించాలి తప్ప ఫ్యాషన్ దుస్తులు ధరిస్తే దర్శనానికి అనుమతి ఇవ్వమని చెప్పారు.