తమ్ముడా పవన్ కళ్యాణ్.. వచ్చెయ్ మనమిద్దరం కలిసిపోదాం.. చంద్రబాబు ఔట్.. జగన్ ఔట్.. మోడి ఔట్.. అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ, సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేసేవారు. ప్రతీ మీటింగ్ లోనూ పవన్ నా తమ్ముడు అని చెప్పుకునేవారు. తనను చూసి దగ్గరకు వచ్చి పవన్ చేతులు కట్టుకుని నిలబడ్డాడని పాల్ అనేకసార్లు చెప్పారు. అలాగే చిరంజీవి మంచి నాయకుడు నటుడు అని, పవన్ కి కనీసం డ్యాన్స్ కూడా రాదంటూ ఎగతాళి చేసేవాడు పాల్.. చాలాచోట్ల పవన్ ని మాత్రమే తిడుతూ ఆయన తన తమ్ముడిగా చెప్పుకునేవాడు పాల్ అయితే ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే పవన్ 136చోట్ల పోటీ చేస్తే 120 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారు. అయితే చాలామంది ఇప్పుడు టీడీపీ వైసీపీలు హోరాహోరీ పోరులో వైసీపీ ఘనవిజయం సాధించిందని ఇప్పుడు జనసేన ఓట్లను కేఏపాల్ దెబ్బ తీసారంటూ సెటైర్లు పేల్చుతున్నారు.
