Home / 18+ / జగన్ మంత్రివర్గం సమీకరణాలు అదుర్స్.. సామాజికవర్గ పరంగా అందరికీ పెద్దపీట

జగన్ మంత్రివర్గం సమీకరణాలు అదుర్స్.. సామాజికవర్గ పరంగా అందరికీ పెద్దపీట

వైసీపీ అధినేత మరికొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే జగన్ క్యాబినేట్ అంటూ పలువురి పేర్లు బయటకు వచ్చిన నేపధ్యంలో జగన్ తోపాటు మరికొందరు ప్రమాణస్వీకారం చేయనున్నారని వార్తలు వినిపించాయి. అయితే జగన్ ఒక్కరే 30వ తేదీ ప్రమాణస్వీకారం చేయనున్నారట.. అయితే అన్ని కులాలకూ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వాలని భావిస్తున్నారట. దీంతో భవిష్యత్ రాజకీయ అవసరాలు, సామాజికవర్గ సమీకరణాలను లెక్కలు వేసుకుని మంత్రివర్గ కూర్పు జరుగుతుందట.. మంత్రివర్గంలో చోటు ఇవ్వలేనివారికి చీఫ్ విప్, డిప్యూటీ విప్, స్పీకర్, డెప్యూటీ స్పీకర్, నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీలు ఇవ్వనున్నారట..

అలాగే రాజకీయాలు, కులాల ఈక్వేషన్ లు పక్కనబెడితే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, కురసాల కన్నబాబు, బుగ్గన రాజేంధ్రనాధ్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొఠారు అబ్బయ్య చౌదరి వంటి సౌమ్యులు, చదువుకున్నవారు, అలాగే కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి డైనమిక్ లీడర్స్, అవినీతికి దూరంగా ఉండే వారు మంత్రివర్గంలో ఉంటే రాష్ట్రంలో సరికొత్తపాలన శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. అలాగే ముఖ్యమంత్రి జగన్ ఆలోచన కూడా ఇలాగే ఉండనుందని తెలుస్తోంది. కులాలవారీగా క్యాబినేట్ లో పరిశీలనలో ఉన్నవారి పేర్లు చూస్తే..

 

ధర్మాన(వెలమ, బీసీ)
బొత్స(తూర్పు కాపు, బీసీ)
పుష్పా శ్రీవాణి (ఎస్టీ)
అవంతి శ్రీనివాస్ (కాపు)
తిప్పల నాగిరెడ్డి (రెడ్డిక, బీసీ)
దాడిశెట్టి రాజా లేదా కన్నబాబు (కాపు)
అనిల్ కుమార్ (యాదవ)
విశ్వరూప్(ఎస్సీ)
గ్రంధి శ్రీనివాస్ (కాపు)
ప్రసాద రాజు (క్షత్రియ)
పార్ధసారధి(యాదవ్,బీసీ)
కొడాలి (కమ్మ )
ఉదయభాను లేదా పేర్ని (కాపు)
ఆళ్ళ (రెడ్డి)
కోన రఘుపతి (బ్రాహ్మణ)
అంబటి (కాపు)
ఆదిమూలపు సురేష్ (ఎస్సీ)
బాలినేని (రెడ్డి)
అన్నా రాంబాబు (వైశ్య)
ఆనం రాంనారాయణ రెడ్డి (రెడ్డి)
అంజాద్ బాషా (ముస్లిం)
శిల్పా చక్రపాణి రెడ్డి (రెడ్డి)
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (రెడ్డి)
ఆర్కే రోజా (బీసీ)
పెద్దిరెడ్డి (రెడ్డి)
వీరిలో ఎక్కువమంది బీసీలు, ఎస్సీలు, యాదవులు తర్వాతిస్థానంలో మాత్రమే రెడ్లు ఉన్నారు. చివరకు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కూడా ఉన్నారు. దీనినిబట్టి ఎవరైనా వైసీపీది రెడ్ల పార్టీగా ముద్రవేస్తే అంతకంటే అవివేకం ఉండదంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat