దేశ రాజధాని ఢీల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్న జగన్.. నేరుగా లోక్‌కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసానికి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ప్రధానిని జగన్ ఆహ్వానించారు. ఈ భేటీలో రాష్ట్రంలోని పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంవంటి అంశాల్ని జగన్ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఈ సందర్భంగా మోదీ జగన్ మోహన్ రెడ్డిని..
ఒక గోప్ప వీరుడిలా పోరాడి.. చంద్రబాబు దుర్మార్గపు పాలనను అంతం చేసి.. ఎన్నికల రణరంగంలో విజయం సాధించావు. ఈ విజయం నీ ఒక్కనిదే కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది. మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగా గోప్ప పాలనను రాష్ట్ర ప్రజలకు అందించాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న మీకు శుభాకాంక్షలు ” అని వైఎస్ జగన్ తో ప్రధాని మోదీ అన్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి.