ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఉండవల్లిలో తన నివాసంలోనే ఉంటున్నారట.టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు,ఎంపీలు చంద్రబాబు ఇంటికి వెళ్తున్నారు.పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు తదితర విషయాలు కొరకు చర్చిస్తున్నారట.ఈరోజు ఆదివారం మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ చంద్రబాబును కలిసారు.అనంతరం నెల్లూరు జిల్లాలో టీడీపీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసారు.మనం నెల్లూరుకు చాలా చేసాము కదా ఐన ఎందుకు ఓడిపోయామని మంత్రులను ప్రశ్నించారు.ఇప్పటికే మంత్రి సోమిరెడ్డి వరుసగా ఐదుసార్లు ఓడిపోయిన సంగతి అందరికి తెలిసిందే,ఐన సరే చంద్రబాబు ఆయనకే సీటు ఇచ్చారు.ప్రజలు పిచ్చివాళ్ళు డబ్బులు పంచిపెడితే ఓట్లు వేసేస్తారు అనుకున్నట్టునారు చంద్రబాబు గారు.కాని ప్లాన్ రివర్స్ అవ్వడంతో చంద్రబాబు షాక్ కి గురయ్యారు.
