ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, వైసీపీ ఎల్పీ నేతగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా శనివారం సాయంత్రం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకుల మధ్య కొద్ది సేపు చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని సీఎం కేసీఆర్ స్నేహహస్తం అందించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ల మధ్య సఖ్యత రెండు రాష్ట్రాలకు మేలు చేసేదని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్లో ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈ రోజు కలిసేందుకు వచ్చిన సందర్భంగా ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని శుభాకాంక్షలు తెలిపాను. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఇలాంటి ఉల్లాసభరిత సంబంధాలు ఉండటం రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు చేసేదే’ అని ఓ ట్వీట్లో కేటీఆర్ పేర్కొన్నారు.
Greeted AP CM designate Sri @ysjagan Garu when he called on Hon’ble CM KCR Garu today
The bonhomie between the Chief Ministers augurs well for the two Telugu states ? pic.twitter.com/GS24DNKjx2
— KTR (@KTRTRS) May 25, 2019