తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోమారు ఏపీలో అడుగుపెట్టనున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ తిరుపతికి వెళ్లనున్నట్టు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
గతంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా వేంకటేశ్వరస్వామికి కేసీఆర్ మొక్కు చెల్లించేందుకు తిరుమల వెళ్లారు. ఆయన స్వామివారిని దర్శించుకుని బంగారు ఆభరణాలను సమర్పించారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా తిరుమలకు వెళుతున్నారు. ఈ సందర్భంగా తిరుమల వెంకన్నను దర్శించుకొని పూజలు చేయనున్నారు.