తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకిదిగిన మాజీ సీనియర్ మంత్రి జానారెడ్డి టీఆర్ఎస్ సీనియర్ నేత నోముల నర్సింహాయ్య మీద భారీ మెజారిటీతో ఓడిపోయిన సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎనబై ఎనిమిది స్థానాల్లో గెలుపొంది రెండో సారి వరుసగా ఆధికారాన్ని దక్కించుకుంది.
ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన టీపీసీసీ చీఫ్ ,హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. అయితే ఉత్తమ్ ఎంపీగా గెలవడంతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈ నేపథ్యంలో జానారెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోయే”హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తను పోటీకి దిగడం లేదని”తెలిపారు.ఆయన ఇంకా మాట్లాడుతూ”పదవుల కోసం తానేప్పుడూ చేతులు చాపలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగుతానంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం తనకు అవకాశమిచ్చేదని “ఆయన చెప్పుకు వచ్చారు.