రాజకీయంగా పదేళ్ల పాటు వెనక్కివెళ్లిపోయిన రాధా ఇప్పుడు మరో ఐదేళ్లు మరింత వెనక్కి వెళ్లిపోయారు. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధా మొత్తం నాలుగు పార్టీలు పారి ఇప్పుడు రాజకీయంగా టెంపరరీ రిటైర్మెంట్ ను తానే తీసుకున్నాడన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రంగా వారసుడిగా ఓ బలమైన సామాజివకర్గం అండదండలు తనకు ఉన్నాయని ఆయన భావించినా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాధాను ఎవ్వరూ పట్టించుకోలేదు.ఇప్పటికే రాజకీయంగా వెనకపడిపోయి ఏం చేయాలో తెలియని అగమ్యగోచర స్థితిలోకి వెళ్లిపోయిన వంగవీటి రాధా వరుసగా తప్పుల మీద తప్పులు చేస్తూ తన రాజకీయ జీవితానికి తానే సమాధి కట్టుకున్నారు. గతంలో వైఎస్ దయతో ఎమ్మెల్యేగా అతి తక్కువ వయస్సులోనే గెలిచి రికార్డు క్రియేట్ చేసిన ఆయన 2009 లో వైఎస్ మంత్రి పదవి ఇస్తానని చెప్పినా వినకుండా తన క్యాస్ట్ ఫీలింగ్ ప్రభావంతో చిరు ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఆయన మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు.ఆ తర్వత వైసీపీలోకి వెళ్లి సెంట్రల్ నుంచి తూర్పు నియోజకవర్గానికి మారి మళ్లీ ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో రాధా నిస్తేజంగా ఉండడంతో జగన్ సెంట్రల్ నియోజకవర్గం బాధ్యతలు మల్లాది విష్ణుకి ఇచ్చారు. ఇప్పుడు జగన్ అంచనా నిజమైంది… సెంట్రల్‌లో మల్లాది గెలిచారు. రంగాకు తూర్పు సీటు లేదా బందరు ఎంపీ సీటు ఇస్తామని చెప్పారు. బందరు ఎంపీగా రాధా వెళ్లకపోవడంతోనే జగన్ బాలశౌరికి ఇచ్చారు. ఇప్పుడు బాలశౌరి బందరు ఎంపీగా మంచి మెజార్టీతో గెలిచారు. చివరకు తన తండ్రి హత్యతో లింక్ ఉన్న టీడీపీలో చేరారు. అక్కడ ఎమ్మెల్సీ ఇస్తామన్న ఆశతో ఆ పార్టీలో చేరినా ఇప్పుడు టీడీపీ చిత్తుగా ఓడడంతో రాధాకు ఎమ్మెల్సీ వచ్చే ఛాన్స్ లేకుండా పోయింది. వంగవీటి రాధా వైసీపీ అభ్యర్థిగాపోటీ చేసినా ఇప్పుడు ఎంపీ అయి ఉండేవారు. అంతేకాదు టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్సీ కాదు కదా.. రాజ్యసభ సీటు కూడా వచ్చే ఛాన్స్ లేకపోవడంతో రాధా రాజకీయ భవిష్యత్తు ఇక అంతే అనే వార్తలు వినిపిస్తున్నాయి. రాధాను నమ్మి వైసీపీ అధినేత వైఎస్ జగన్ గొప్ప స్థానం ఇచ్చాడు . కానీ చిన్న చిన్న కారణాలకి బయటకి వెళ్ళిపోయి నాయకుడి ప్రేమకి నేను అర్హుడుని కాదని నిరూపించుకొన్నాడు .భవిష్యత్ ని చేజేతులా నాశనం చేసుకొన్నారు.
