తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తిరుమల తిరుపతికి వెళ్లనున్నారు. సతీసమేతంగా సీఎం కేసీఆర్ ఈ రోజు ఆదివారం మధ్యాహ్నాం తిరుపతికి బయలుదేరి వెళ్లనున్నారు.ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి తిరుపతికి బయలుదేరతారు. రేపు సోమవారం తిరుమల తిరుపతి దేవాలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం అవుతారు..
