ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్రంలో 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దిగితే మొత్తం 120 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. మొత్తమ్మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.13 కోట్ల ఓట్లు పోలైతే, జనసేన కు కేవలం 21లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పార్టీ పోటీచేసిన చాలా నియోజకవర్గాల్లో జనసేనకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా జనసేన తరపున బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మూడవ స్థానానికే పరిమితమయ్యారు.
ఇక పవన్ అయితే రెండు చోట్ల ఓడిపోయారు. ఈ క్రమంలో తన యూట్యూబ్ ఛానెల్ అయిన నా ఛానల్ నా ఇష్టం ఛానల్ లో మాట్లాడుతూ”ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుబాకాంక్షలు “తెలిపారు.. నవరత్నాలు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ ఐదేళ్లలో జగన్ నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నట్టు ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. తమ సహకారం జగన్‌కు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. జనసేన గెలుపుకోసం పనిచేసిన జనసైనికులకు అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. క్లీన్ పాలిటిక్స్‌తో రాజకీయాల్లోకి వచ్చామని. జనసేనకు కొన్ని లక్షల ఓట్లు వచ్చాయన్నారు. జనసేన ఎన్నికల్లో ఓడిపోయినా.. నైతికంగా మాత్రం విజయం సాధించిందన్నారు.