Home / ANDHRAPRADESH / మొదటి ఆరు నెలలు తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి అన్పించుకునేలా పాలన అందిస్తా

మొదటి ఆరు నెలలు తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి అన్పించుకునేలా పాలన అందిస్తా

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను తమ నాయకుడిగా ఎనుకున్నారు. వైఎస్‌ జగన్‌ను తమ నేతగా ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని జగన్‌ క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన విషయం తెలిసిందే. సమావేశంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని శాసనసభపక్ష నేతగా ఎన్నుకుని.. పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకవాఖ్య తీర్మానం చేశారు.ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లడుతూ గత ఐదేళ్లలో ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా నిలిచింది వైసీపీ ప్రజల విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి వచ్చాం. 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను స్వీప్ చేశాం అన్నారు. అన్యాయం చేస్తే దేవుడు మొట్టికాయలు వేస్తాడనడానికి చంద్రబాబే నిదర్శనం అందుకే 50 శాతం కూడా వైసీపీకే పడింది అన్నారు. అంతేకాదు ఈ విజయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది తెలిపారు. మన పార్టీ నుంచి అన్యాయంగా చంద్రబాబు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలు 23, ఎంపీలు ముగ్గురు

ఇప్పుడు అదే టీడీపీకి మిగిలింది, చంద్రబాబుకు వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 23 అని ఎద్దెవ చేశారు. ఇంకా మన టార్గెట్ 2024 – 2024లో ఇంతకన్నా ఎక్కువ సీట్లతో గెలవాలి – ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలిమన పాలన చూసి ప్రజలు 2024లో మనకు ఓటెయ్యాలి అన్నారు. – రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరూ చూడనివిధంగా ప్రక్షాళన చేస్తా – మామూలుగా ఉండదు ఆ ప్రక్షాళన – దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేవిధంగా ప్రక్షాళన చేస్తా – ఆ ప్రక్షాళనకు మీ అందరి సహాయసహకారాలు కావాలి, అందించాలి. మొదటి ఆరు నెలలు తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి అన్పించుకునేలా పాలన అందిస్తా. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయ్, వాటిని కూడా క్లీన్‌స్వీప్ చేయాలి – ఈ విజయానికి కారణం నాతోపాటు మీ అందరూ – ప్రజలు మనకు గొప్ప బాధ్యత అప్పగించారు. 2024లో ఇంతకంటే గొప్పగా గెలవాలని జగన్ అన్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat