ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెల్సిందే. దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ముప్పై తారీఖున నవ్యాంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర బడ్జెట్ పై ,రెవిన్యూలోటు, ఆర్థిక పరిస్థితుల గురించి సంబంధిత అధికారులతో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు ఆర్థిక పరిస్థితులపై ఒక నివేదక ఇచ్చారు.
ఈ నివేదికలో 2018-19మధ్య రెవిన్యూ లోటు రూ. 12000కోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అటు రాష్ట్ర విభజనతో పాటు వారసత్వంగా వచ్చిన రుణాలతో మొత్తం కలిపి 2.58లక్షల కోట్లకు అప్పు ఉందని అధికారులు నివేదికలో తెలిపారు అని సమాచారం. అయితే గత ఐదేండ్లలో టీడీపీ సర్కారు చేసిన అప్పులతోనే ఇంతమొత్తం అయిందని అధికారులు తెలపడం విశేషం. మరి జగన్ ఈ అతిపెద్ద సవాలును అధిగమిస్తాడో ..లేదో కాలమే సమాధానం చెబుతుంది.