తాజాగా వైసీపీ ఎంపీగా బాపట్ల నుండి గెలిచిన నందిగం సురేష్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు. అధినేత జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఆ సమయంలో నందిగం సురేష్ మాట్లాడుతూ తాను ఇదే రాజధాని ప్రాంతంలో పొలంపనులు చేసుకొనే వాడినని, తనకు ఏ ఆర్థిక నేపథ్యం లేకపోయినా తనను ఎంపీగా ప్రకిటించి.. గెలిపించి, పార్లమెంట్ కు పంపిస్తున్న ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. తనతో వైయస్సార్ సమాధి వద్ద వైసీపీ లోక్‌సభ అభ్యర్దుల జాబితా విడుదల చేయించిన రోజును తానిప్పటికీ మర్చిపోలేనన్నారు. కూలిపనులకు వెళ్లే తమలాంటివారికి ఎంపీలుగా అవకాశం ఇచ్చారంటూ భావోద్వేగానికి గురయ్యారు. భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడే ఉన్న మిగిలిన ఎంపీలు కూడా భావోద్వేగానికి గురయ్యారు. వారికి జగన్ ఓదార్చుతూ మీరు ఎంపీలుగా గెలిచిన క్షణం నుండి మీ మీద బాధ్యత పెరిగింది.. ప్రజలకోసం కలిసికట్టుగా పనిచేద్దామంటే వారికి కార్యాచరణ నిర్ధేశించారు.
