విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ చేజార్చుకుంది.. పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిచినా పార్టీ ఎంపీ అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) మాత్రం ఓడిపోయారు. అయితే తానే గెలిచినా, గెలవకపోయినా తాను ఎప్పటికీ విజయవాడ వాడినేనన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో తాను, తమ ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి అందుబాటులో ఉంటామన్నారు. 130 స్ధానాలకుపైగా వైఎస్సార్సీపీ గెలుస్తుందని తాను అనేకసార్లు చెప్పినా ఎవరూ నమ్మలేదని గుర్తు చేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా తక్కువ మార్జిన్‌తోనే ఓడిపోయానన్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. 19 రోజులే పార్లమెంట్ పరిధిలో పర్యటించానని, కొంచెం ముందు వచ్చి ఉంటే భారీ మెజారిటితో గెలిచేవాడినన్నారు. ఇకనుండి రెగ్యులర్‌గా విజయవాడ ప్రజలతోనే ఉంటానని తెలిపారు. ముఖ్యంగా తనకు సరైన టైం లేకపోవడం, ప్రత్యర్ధి కేశినేని నానికి బలమైన క్యాడర్ ఉండడంతోపాటుగా హోదా ఔట్ డేటెడ్ సబ్జెక్ట్ అంటూ హోదాను తక్కువ చేసి మాట్లాడడం పట్ల కూడా చాలామంది యువత, విద్యార్ధులు పీవీపీకి ఓటు వేయలేదనేది తెలుస్తోంది.
