వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో గెలుపొందారు. వైఎస్ జగన్ తన సమీప టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డిపై 90 వేల 543 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. వైఎస్ జగన్‌కు 2014 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి 15 వేల 500 ఓట్లు ఎక్కువ వచ్చాయి. వైఎస్ జగన్‌తో పాటు కడప జిల్లాలోని మిగతా వైసీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు. కడప అసెంబ్లీ స్థానంలో వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా 52532 తేడాతో గెలుపు, ప్రొద్దుటూరులో 43,200 తేడాతో వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గెలుపు, మైదుకూరులో వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి 27798 ఓట్ల తేడాతో గెలుపు, బద్వేల్‌లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ వెంకట సుబ్బయ్య 47 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. జమ్మలమడుగులో వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి 31,515 ఓట్లతో తేడాతో గెలుపొందారు. రైల్వే కోడూరులో వైసీపీ అభ్యర్థి కొరుముట్ల శ్రీనివాసులు 24,059 ఓట్లతో గెలిచారు, రాయచోటిలో వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి 20,677 ఓట్ల ఆధిక్యతతో, రాజంపేటలో మేడా మల్లికార్జున రెడ్డి 27,465 ఓట్లతో గెలుపు, కమలాపురంలో వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి సుమారు 25 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాదించారు.
