రాయలసీమలో అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట. అలాంటి తెలుగుదేశం పార్టీ కంచుకోట బద్దలైంది. టీడీపీకి 2014 ఎన్నికల్లో 12 సీట్లు..వైసీపీకి రెండు సీట్లు దక్కాయి. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. అనంతలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ దెబ్బకు వైసీపీకి 12 సీట్లు..టీడీపీకి రెండు సీట్లు వచ్చాయి. ఇదే జిల్లాలో తమ అధిపత్యానికి అడ్డులేదని భావించే జేసీ..పరిటాల కుటుంబాలకు జగన్ ఫుల్ స్టాప్ పెట్టాడు . రెండు కుటుంబాల వారసులకు ఆదిలోనే చెక్ పెట్టాడు. జిల్లాలో 35 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న జేసీ బ్రదర్స్ పాలనకు తాడిపత్రిలో మొదటి సారి షాక్ తగలింది. తమ వారసులను ప్రమోట్ చేద్దామని భావించిన జేసీ బ్రదర్స్ కు ఇది ఊహించని దెబ్బ. గెలుపు కోసం 50 కోట్లు ఖర్చు చేసామని వ్యాఖ్యానించిన జేసీ దివాకర్ రెడ్డి తమ కుమారుల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. దివాకరరెడ్డి కుమారుడు పవన్ రెడ్డి లోక్ సభ కు అనంతపురం నుంచి పోటీచేసి ఓడిపోయారు.అలాగే జెసి ప్రభాకరరెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే సీటుకు పోటీపడి పరాజయం చెందారు.
