సీఐ గోరంట్ల మాధవ్..ఈ పేరు చెబితే ఎవరికైనా టక్కున గుర్తొస్తుంది.ఎందుకంటే సాక్షాతూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపైనే మీసం మెలేసాడు.ఎన్నికలు ముందు ఒక కేసు విషయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మాధవ్‌కు మధ్య పెద్ద వివాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో జేసీ పోలీసులను దూషించడంతో ఈ సీఐ ఆయనపై విరుచుకుపడ్డాడు అంతేకాకుండా జేసీపై మీసం కూడా మెలేసాడు.అంతే ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరాడు.అంతేకాక ఎంపీ సీటు సాధించి హిందూపురంలో పోటీ చేసి గెలిచారు.జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించాడు.
