సాధారణంగా ఎన్నికల్లో గెలుపోటములు సహజసాధారణం.. అయితే పార్టీ పెట్టిన వ్యక్తి.. పార్టీ స్థాపించిన వ్యక్తి ఓడిపోవడం చరిత్రలో చాలా అరుదు.. ఇదే పరిస్థితి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కేఏ పాల్ ఇద్దరికీ ఎదురైంది. పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్ధుల చేతిలో పవన్ పరాజయం పాలయ్యారు. కేవలం తూర్పుగోదావరి జిల్లా రాజోలులో రాపాక వరప్రసాద్ కాస్తో కూస్తో పోటీ ఇచ్చినా ఆయన కూడా ఓటమి పాలయ్యారు. అయితే పవన్ కనీసం ఒక్కచోట కూడా గెలవకపోవడం గమనార్హం. ఎంపీ సీట్లు కూడా ఇదే విధంగా వచ్చాయి. ఈ నేపధ్యంలో కేఏ పాల్, పవన్ కళ్యాణ్ ల రాజకీయ శైలి చర్చకు వస్తోంది. పవన్ కూడా చాలాసార్లు తాను ముఖ్యమంత్రి అవుతానని చెప్పారు. ఒక కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి అవ్వకూడదా అని ప్రశ్నించారు. అలాగే కేఏ పాల్ కూడా తానే కాబోయే ముఖ్యమంత్రిని అని చెప్పుకొచ్చారు. తాను, పవన్ ఇద్దరూ కలిస్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఇద్దరూ కనీసం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఖాతాలు కూడా తెరవకపోవడం విశేషం.