ఏపీ అసెంబ్లీ చరిత్రలో మరో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.ఏపీ చరిత్రలో తొలిసారిగా ప్రాంతీయ పార్టీలే అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించనున్నాయి.ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2014లో జరిగిన కాంగ్రెస్ ఒక్కచోట కూడా గెలవలేదు. అయితే టీడీపీతో మిత్రపక్షంగా బరిలోకి దిగిన బీజేపీ నాలుగు చోట్ల గెలుపొందింది.అయితే జాతీయ పార్టీలు అయిన సీపీఎం,బీఎస్పీ కూడా ఏపీలో ఖాతా తెరవలేదు. అయితే తాజాగా విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు,జగన్మోహాన్ రెడ్డి తప్పా పవన్(జనసేన),రఘువీరా రెడ్డి(కాంగ్రెస్),కన్నా లక్ష్మీ నారాయణ(బీజేపీ),కేఏపాల్ (ప్రజాశాంతి)ఓడిపోయారు.జాతీయ పార్టీలు అయిన బీజేపీ,కాంగ్రెస్,సీపీఎం,సీపీఐ,ఎస్పీ,బీఎస్పీ ఖాతా తెరవలేదు..